
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న గ్యాస్ సిలిండర్ నేరుగా ఐదు వందలరూపాయలకే లబ్ధిదారులకు అందించాలని బి ఆర్ ఎస్ మండల నాయకులు గుద్దేటి చిన వెంకన్న ప్రభుత్వాన్ని కోరారు. శనివారం బండమీది చందుపట్ల గ్రామంలో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, లబ్ధిదారులు ముందు మొత్తం పైసలు చెల్లించి గ్యాస్ సిలిండర్ తీసుకొంటే, ఆ తర్వాత లబ్ధిదారులబ్యాంకు ఖాతాలలో పైసలు జమ చేస్తామనటం కరెక్ట్ కాదని, అన్నారు.. లబ్ధిదారుల నుంచి పూర్తి మొత్తం తీసుకోవటం,తరువాత బ్యాంకు ఖాతాలో జమచేయడం, కాకుండా, మొదటనే ఐదు వందల రూపాయలు తీసుకొని గ్యాస్ సిలెండర్ ఇస్తే ఏ గందరగోళం ఉండదని ఆయన అన్నారు. మొత్తం పైసలు ముందు చెల్లించి గ్యాస్ సిలిండర్ తీ సుకోవాలన్నా పేదలకు ఆర్థికంగా ఇబ్బంది గా ఉంటుందని, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని నేరుగా లబ్ధిదారులకు ఐదు వందల రూపాయలకే, గ్యాస్ సిలెండర్ ఇవ్వాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.