
మహాశివరాత్రి పురస్కరించుకొని మిరుదోడి మండలం అల్వాల గ్రామంలో శివాలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ యొక్క అన్నదాన దాత గుర్రప్ప గారి శేషు, కార్యనిర్వాహకుడు సారా ప్రకాష్ ల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవ చేయడంలో ఎంతో సంతృప్తిగా ఉంటుందని వారు అన్నారు. అన్ని దానాల కన్నా అన్నదానం ఎంతో గొప్పదని అన్నారు. మానవసేవే మాధవసేవ అనే నినాదంతో ప్రజలకు సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కిష్టయ్య, గుర్రప్ప గారి ప్రవీణ్ కుమార్ ప్రతాప్ ,మధు ,ప్రసాద్, శ్రీకాంత్, రాజు ,నిఖిల్, నిరుటి రాజు , శేఖర్ అనిల్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.