ఆలయం చుట్టూ దుకాణ సముదాయాలు.. భక్తులకు ఇబ్బందులు

నవతెలంగాణ – మద్నూర్

మద్నూర్ మండల కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో గల ఆంజనేయస్వామి ఆలయం చుట్టూ ఏర్పాటు చేసుకున్న వ్యాపార సముదాయాల పట్ల ఆలయ భక్తులకు కూర్చోవటానికి ఇబ్బందులు కలుగుతున్నాయని, ఆలయం చుట్టూ ఏర్పాటు చేసే దుకాణాల పట్ల గ్రామపంచాయతీ అధికారులు పట్టించుకోవాలని గ్రామస్తులు, భక్తులు కోరుతున్నారు. ఎటుపడితే అటు ఇష్టం వచ్చిన రీతిలో చిరు వ్యాపార దుకాణాలు ఏర్పాటు చేయడం పట్ల ఆలయం భక్తులకు ఇబ్బందికరంగా ఏర్పడుతుందని, ఆలయం చుట్టూ శుభ్రత నెలకొల్పాలని భక్తులు గ్రామస్తులు కోరుతున్నారు.