సుహాస్, కార్తీక్‌రత్నం,రుహానిశర్మ, విరాజ్ అశ్విన్ ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం ‘శ్రీరంగనీతులు’. ప్రవీణ్‌కుమార్ వీఎస్ఎస్ దర్శకుడు. రాధావి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకటేశ్వరరావు బల్మూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 12న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ,’యువతరం భావోద్వే గాలతో, సినిమాలోని పాత్రలతో తమను తాము ఐడెంటిఫై చేసుకునే కథలతో, సహజంగా సాగే మాటలు, మనసుకు హత్తుకునే సన్నివేశాలతో వచ్చే సినిమాలు చాలా అరుదుగా వుంటాయి. మా సినిమా ఈ కోవలోనే చేరుతుంది. ఇటీవల విడుదలైన మా టీజర్‌కు, టైటిల్ సాంగ్‌కు మంచి స్పందన వచ్చింది, అజరు అరసాడ, హర్షవర్థన్ రామేశ్వర్ అందించిన సంగీతం మా చిత్రానికి ప్రధాన ఆకర్షణగా వుంటుంది’ అని అన్నారు. నిర్మాత మాట్లాడుతూ,’నేటి యువత ఆలోచనలు, కుటుంబ బంధాలు..ఎంటర్టైన్మెంట్ ఇలా అన్ని అంశాల కలయికతో దర్శకుడు ఈ చిత్రాన్ని అందర్ని అలరించే విధంగా తెరకెక్కించాడు. ఏప్రిల్ 12న చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం’ అని తెలిపారు.