
మండలంలోని బీరెల్లి, రంగాపూర్ గ్రామాలలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి,& స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మాత్యులు డాక్టర్ సీతక్క చొరవతో మంజూరైన రూ.20 లక్షల సీసీ రోడ్లను మాజీ సర్పంచులు ఇర్ప అశ్విని సూర్యనారాయణ, బెజ్జూరి శ్రీనివాస్ లు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏజెన్సీ గ్రామాల అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యం అన్నారు. ఈ కార్యక్రమం లో బీరెల్లి విలేజ్ కమిటీ అధ్యక్షులు కోటేశ్వరరావు, వీరాపూర్ ఉపసర్పంచ్ జవ్వాజి మోహన్ రావు, వంగరి అజయ్ తదితరులు పాల్గొన్నారు.