విధ్యదాన్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో  గ్రంధాలయం ఏర్పాటు

– విద్యార్థులకు నిరంతరం విజ్ఞానం
– విద్యాదాన్ ఫౌండేషన్ వారి సేవలు అధ్వితీయం
నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండలోని ఎస్ఎల్ బీసీ లో గల సాగర్ నియోజకవర్గం అనుముల సోషల్ వేల్పేర్ పాఠశాల, కళాశాలలో విద్యాదాన్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకి గ్రంధాలయానికి సంబందించిన 200 పై చిలుకు వివిధ టైటిల్స్ పుస్తకాలు, బీరువా, ప్రీంటర్,స్కనర్, 5 టేబుల్స్,20 కుర్చీలు ఆదివారం పంపిణి చేశారు. ఈ
కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఏకే ఫౌండేషన్ చైర్మన్ కట్టెబోయిన అనిల్ కుమార్  మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సహకరించిన వంగాల మేరీ కి కృతజ్ఞతలు తెలియజేశారు, విద్యాదాన్ కో ఫౌండర్ ఈదర లక్ష్మీ ప్రసన్న మన ప్రాంత ప్రజలకి తమ సేవలు అందించడం అభినందనీయం అని,ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న ఫౌండేషన్ సభ్యులు బుర్ల హరిత రమేష్, సుధా, వెంకటేష్ శ్రీరామ్, చైతన్య లను అభినందించారు.అదేవిధంగా పాఠశాల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న పాఠశాల ప్రిన్సిపాల్ రవి కుమార్ ను ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎసెల్బిసి ప్రాజెక్టు డి.ఏ. ఓ రవీందర్ రెడ్డి, యాదవ సంఘం నాయకులు మన్నెం శ్రీనివాస్ యాదవ్, కండగట్ల సందీప్ కుమార్, కళాశాల ఉపాధ్యాయ బృందం, లైబ్రెరీన్ మెరావత్ శ్రీను నాయక్, ఏకే ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.