అమరజీవి గుడ్ల శివరావు స్ఫూర్తితో ఉద్యమించాలి

– సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా
నవతెలంగాణ-దుమ్ముగూడెం
నిత్యం ప్రజలతో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం తుది శ్వాస వరకు పోరాడిన అమరజీవి గుడ్ల శివరావు స్పూర్తితో నేటి యువత భవిష్యత్‌ ఉద్యమాలు నిర్వహించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు అన్నారు. లకీëనగరం స్టేట్‌ బ్యాంకు ఎదురుగా ఉన్న యలమంచి సీతారామయ్య, గుడ్ల శివరావుల స్థూపం వద్ద అమరజీవి గుడ్ల శివరావు 11వ వర్థంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా పార్టీ జెండాను మాజీ డిసిసిబి చైర్మన్‌ యలమంచి రవికుమార్‌ ఎగురవేయగా శివరావు, సీతారామయ్యల చిత్రపటాలకు నాయకులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా జరిగిన వర్థంతి సభలో మచ్చా మాట్లాడుతూ… శివరావు నిత్యం బడుగు, బలహీనవర్గాల ప్రజలు పడుతున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం కృషి చేసేవాడన్నారు. 2012 మే 29వ తేదీన మండలంలోని ఓ మారుమూల గిరిజన గ్రామంలో భూ సమస్య పరిష్కారం కోసం వెళ్లి వడదెబ్బ తగిలి మృతి చెందాడన్నారు. అమరజీవి యలమంచి సీతారామయ్య అడుగుజాడల్లో నమ్ముకున్న సిద్దాంతం కోసం కడ వరకు కమ్యూనిస్టుగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం తుది శ్వాస విడిచిన శివరావు నేటి యువతకు ఆదర్శం అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిత్యవసర ధరలను విపరీతంగా పెంచడం వలన పేదల నడ్డి విరుగుతుందని పెంచిన డీజిల్‌, గ్యాస్‌, పెట్రోలు ధరలు తగ్గించాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ, ఎస్సీ, బిసి, మైనార్టీలుగా ఉన్న పేదలమందరికి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు మంజూరి చేయాలని, ఇంటి స్థలం ఉన్న వారికి ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షల రూపాయలు చెల్లించాలన్నారు. సిపిఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు యలమంచి వంశీకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భద్రాచలం నియోజకవర్గ కో కన్వీనర్‌ కారం పుల్ల య్య, జిల్లా కమిటీ సభ్యులు మర్మం చంద్రయ్య, కొర్సా చిలకమ్మ, నాయకులు యలమంచి శ్రీనివాస రావు(శ్రీనుబాబు), మర్మం సమ్మక్క, గుడ్ల రామ్మోహ న్‌రెడ్డి, మహమద్‌ బేగ్‌, గుడ్ల సాయిరెడ్డి, అంజిరెడ్డి, గుడ్ల తాతారావు, సందీప్‌ తదితరులు పాల్గొన్నారు.