చీడపీడలు ఆశించడంతో ఊరగాయ సాగులో తీవ్ర నష్టం

– దోసకాయ పంటపై ఆశలు పెట్టుకున్న వృద్ధ మహిళ
నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం మౌలాలి తాండ గ్రామానికి చెందిన వృద్ధ మహిళ రేణుక 30 గుంటల భూమి కౌలుకు తీసుకొని వివిధ రకాల కూరగాయ పంటలు వేయగా చీడపీడలు ఆశించడంతో తీవ్ర నష్టం జరిగిందని మహిళ ఆవేదన వ్యక్తం చేస్తుంది. బెండ క్వాలీ ఫ్లవర్, వంకాయ, బెండకాయ తదితర పంటలను వేయగా చీడపీడల వల్ల తీవ్ర నష్టం వాటికి అన్నారు. వంకాయ సాగు చేయగా ప్రతి కాయకు చీడపీడల ఆశించడంతో వాటిని తెంపి పారవేశానని ఆమె పేర్కొంది. చేసేది లేక అట్టి పంటలను తొలగించి అదే స్థలంలో దోసకాయ సాగు చేశానన్నారు. ప్రస్తుతం దోష కాయపంట పూత దశకు వచ్చిందని దానిపైనే తమ ఆశలు పెట్టుకున్నామని ఆమె పేర్కొంది. అలీ సగర్ ఎత్తిపోతల పథకం ద్వారా వెళ్లే ప్రధాన కాలువలో మోటర్ ద్వారా ఇట్టి పంటలను సాగు చేస్తున్నాననీ ఆమె అన్నారు. ప్రస్తుతం తరుణంలో దోసకాయ 50 నుంచి 60 రూపాయల వరకు పలుకుతుండడంతో గిరిజన మహిళలు ఈ పంట పై ఆసక్తి చెబుతున్నారని ఆమె పేర్కొన్నారు.
రేణుక (రైతు) మౌలాలి తాండ :వందలాది రూపాయల పెట్టుబడులు పెట్టి వివిధ రకాల కూరగాయల పండించగా, చీడపీడలు ఆశించడంతో తీవ్ర నష్టం జరగడమే కాకుండా పెట్టుబడును సైతం రాలేదని ఆమె పేర్కొంది. అదే భూమిలో తిరిగి దోసకాయ పంట వేశానని, ప్రస్తుతం ఈ పంట పై అయినా తాను పెట్టిన పెట్టుబడును వస్తాయన్న ఆశతో ఎదురుచూస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.