సిమెంటు రోడ్డు పనులు ప్రారంభం

నవతెలంగాణ – కమ్మర్ పల్లి

మండలంలోని నాగపూర్ గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన రెండు సిమెంటు రోడ్డు పనులను ఆదివారం ప్రారంభించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు భూమి పూజ నిర్వహించి సిమెంట్ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్  సహకారంతో గ్రామంలోని  రెండు కాలనీల్లో  సిమెంట్ రోడ్డు పనులకు గాను రూ. 5 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపారు. అట్టి నిధులతో  సిమెంట్ రోడ్డు పనులను చేపట్టినట్లు వారు వివరించారు. గ్రామంలో సిమెంట్ రోడ్ల నిర్మాణం కోసం నిధులు సమకూర్చిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్ కు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, సునీల్ యువసేన నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వేముల గంగారెడ్డి, కిసాన్ కేత్ జిల్లా నాయకులు పడిగల ప్రవీణ్, అవారి సత్యనారాయణ, బోనగిరి లక్ష్మణ్, నాగపూర్ మాజీ ఉపసర్పంచ్ కప్పదండి అశోక్, సునీల్ యువసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.