కాపురంలో బెల్టుషాపులను మూసివేయాలి

– ఆదివాసీ నాయకపోడు హక్కుల పోరాట సమితి 
– భూపాలపల్లి నియోజకవర్గ ఇంఛార్జి బద్దీ రమేష్ నాయకపోడ్ 
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కాపురం గ్రామంలో అధిక రేట్లకు మద్యం విక్రయిస్తూ ఓసిపి కార్మికులను,ఆదివాసీ గిరిజనులను నిలువున దోపిడీ చేస్తున్న బెల్టుషాపుల నిర్వహకులపై కేసులు నమోదు చేసి,వెంటనే బెల్టుషాపులను మూసివేయాలని ఆదివాసీ నాయకపొడు హక్కుల పోరాట సమితి భూపాలపల్లి నియోజకవర్గ ఇంఛార్జి బద్దీ రమేష్ నాయకపోడ్ ఎక్సైజ్ శాఖ అధికారులను డిమాండ్ చేశారు.ఆదివారం మండల కేంద్రమైన తాడిచెర్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు కాపురం వందశాతం ట్రైబల్ ఆదివాసీ గిరిజనులు నివసించే ప్రాంతం కావడంతో బెల్టుషాపుల నిర్వాహకులు మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తూ అమాయక గిరిజనులను అందినకాడికి దండుకుంటూన్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.ఒక్కొక్క కోటర్, బీర్ పై రూ.50 నుంచి రూ.80 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని వాపోయారు. ఇదేమిటని ప్రశ్నిస్తే నీకు దిక్కున్న చోట చెప్పుకొని దురుసుగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు.తాడిచెర్ల వైన్స్ షాపులో  దొరకని కెఏప్ లైట్,స్ట్రాంగ్ బిర్లు బెల్టుషాపుల్లో ఫుల్ గా ఉన్నాయని,ఇదేమిటని వైన్స్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే మాకు సంబంధం లేదని చెప్పినట్లుగా తెలిపారు.పొద్దంతా శ్రమ చేసిన ఓసిపి కార్మికులు,కూలీలకు వచ్చిన డబ్బులు మద్యానికి ఖర్చు చేస్తూ జేబులు గుళ్ళ చేసుకుంటూ పలు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. ప్రభుత్వం, ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు పట్టించుకోని వైన్స్ దుకాణాల్లో అన్ని రకాల మద్యం అమ్మకాలు జరిపేలా వైన్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకొని, బెల్టుషాపులు దుకాణాలను మూసివేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.