మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: ఎంపీటీసీ

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అంగన్వాడి టీచర్లు గుర్రం ఉమాదేవి గుర్రం పద్మ ఆధ్వర్యంలో గ్రామ మహిళలకు ఆదివారం ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక సిపిఐఎం పార్టీ ఎంపీటీసీ తడక పారిజాతమోహన్ నేత హాజరై క్రీడల్లో విజేతలైన మహిళలకు బహుమతి ప్రధానోత్సవం చేయడం జరిగింది. గ్రామానికి సంబంధించి ప్రభుత్వ పరంగా సేవలు చేస్తున్నటువంటి గ్రామ ప్రభుత్వ ఉద్యోగులు అయినటువంటి ఒకటవ సెంటర్ అంగన్వాడీ టీచర్ గుర్రం ఉమాదేవి రెండవ సెంటర్ అంగన్వాడీ టీచర్ గుర్రం పద్మ ఒకటవ ఆశా వర్కర్ బెదరకోట మీనాక్షి రెండవ ఆశ వర్కర్ బుడ్డ విజయ అంగన్వాడి ఆయాలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా స్థానిక ఎంపీటీసీ తడక పారిజాత మోహన్ నేత ఘనంగా సన్మానం చేశారు. ఈ సమావేశాన్ని ఉద్దేశిస్తూ స్థానిక ఎంపిటిసి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నేలపట్ల మాజీ ఉప సర్పంచులు తడక వెంకటేశం రంగం అంబాలుకేశవులు మాజీ వార్డు సభ్యులు గంజి లింగేష్ గ్రామ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం అనంతరం గ్రామ మహిళలందరూ కలిసి స్థానిక ఎంపిటిసి తడక పారిజాతమోహన్ నేత ను సన్మానించారు.