ఇరువర్గాలు కలిసి ఉండాలి: డిచ్ పల్లి సీఐ మల్లేష్

నవతెలంగాణ – జక్రాన్ పల్లి

జక్రాన్ పల్లి మండల కేంద్రంలో ఇరు వర్గాలు కలిసి ఉండాలని డిచిపల్లి సీఐ మల్లేష్ ఆదివారం అన్నారు. మండల కేంద్రంలోని రజక సంఘం, ఇతర కులాల మధ్య సమస్యను గురించి రజక సంఘంతో ఇతర కులాలతో సమావేశం ఏర్పాటు చేసి ఒకరికొకరు పరస్పరంగా కలిసి ఉంటూ సహాయ సహకారాలు అందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై తిరుపతి, మాజీ డిసిఎంఎస్ చైర్మన్ మునిపెల్లి సాయి రెడ్డి ఇతర కులాల నాయకులు రజక సంఘం తదితరులు పాల్గొన్నారు.