సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం 

నవతెలంగాణ – నసరుల్లాబాద్
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్టీసీ ఉద్యోగులకు 21% ఫిట్మెంట్ ప్రకటించినందుకు ఆదివారం బాన్సువాడ డిపో ఎదుట బాన్సువాడ డివిజన్ కాంగ్రెస్ పార్టీ  నాయకులు, పలు ఆర్టీసీ కార్మికులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులకు ఫిట్మెంట్ ప్రకటించడం ద్వారా ఉద్యోగులకు ఎంతో మేలు జరుగుతుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.