నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్రంలో సంచలనం రేపిన ఎస్‌ఐబీలో రికార్డుల ధ్వంసానికి సంబంధించి డీఎస్పీ ప్రణీత్‌రావుపై నగర పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. గతంలో ఎస్‌ఐబీలో పని చేసి ప్రస్తుతం జగిత్యాల డీసీఆర్బీలో ఉన్న ప్రణీత్‌ను ఇటీవలనే ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం విదితమే. గత ప్రభుత్వ హయాంలో ఎస్‌ఐబీలో ఉండగా.. ప్రణీత్‌రావు కొందరు ప్రతిపక్ష నాయకులతో పాటు ప్రభుత్వాధికారుల ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి.