– తాండూరు ఏఎంసీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్
– శ్రీ కట్ట మైసమ్మ ఆలయంలో భక్తులకు అన్నదానం
నవతెలంగాణ-తాండూరు
అన్ని దానాలలో కెల్లా అన్నదానం గొప్పదని తాం డూరు ఏఎంసీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్ అన్నారు. తాండూరు పట్టణంలోని పాతకుంట ఆదర్శనగర్‌లో వెలసిన శ్రీ కట్ట మైసమ్మ ఆలయంలో ఆదివారం అమా వాస్యను పురస్కరించుకొని భక్తులకు అన్నదాన కార్యక్ర మాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి తాండూరు ఏఎంసీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్ హాజరై ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ శ్రీ కట్ట మైసమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 15 నెలలుగా ప్రతీ అమావాస్యను పుర స్కరించుకొని అమ్మవారి ఆలయ సన్నిధిలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న అల్లంపల్లి ప్రకాష్ కుజల నర్సింలు కుటుంబ సభ్యులను విఠల్ నాయక్ ఈ సందర్భంగా అభినందించారు. శ్రీ కట్ట మైసమ్మ అమ్మ వారు మహిమగల దేవత అని అన్నారు. వారిపై అమ్మవా రి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయన్నారు. శ్రీ కట్ట మైస మ్మ భక్తులు కోరుకున్న కోరికలను తీర్చే మహా గొప్ప మహిమగల దేవతా అని, తాండూరు ప్రజలపై అమ్మవా రి ఆశీర్వాదం ఉండాలని అందరూ ఆయురారోగ్యాలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్ కౌన్సిలర్ శోభారాణి అల్లంపల్లి ప్రకాష్ కుజల నర్సింలు హౌటల్ నాగమ్మ న్యాయవాది దిలీప్ సింగ్ ఠాకూర్ భక్తులు తదితరులు పాల్గొన్నారు.