రెండు రోజుల్లో నల్లగొండ, భువనగిరి అభ్యర్థుల ప్రకటన

– మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రెండు రోజుల్లో నల్లగొండ, భువనగిరి బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్‌ రెడ్డి తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ మూడు నెలల పాలనలో రాష్ట్రంలో మార్పు తిరోగమనంలో వస్తున్నదని ఎద్దేవా చేశారు. ప్రజలు నీళ్ల ట్యాంకర్ల కోసం ఎదురు చూస్తుంటే, రైతులు సాగునీటి కోసం అల్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సాగునీటిరంగంపై సమీక్షించాలని ఆయన డిమాండ్‌ చేశారు. రైతులకు ఏం భరోసా ఇస్తారో చెప్పాలని నిలదీశారు. సీఎం రేవంత్‌ రెడ్డి ఢిల్లీ పర్యటన మానుకుని కరువు పర్యటన చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.