నవతెలంగాణ – అచ్చంపేట
ఇందిరమ్మ రాజ్యంలో పేదింటి కలలు సహకారం అవుతున్నాయని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మధుకర్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన నవతెలంగాణతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పటికీ పేదలకు డబుల్ బెడ్ రూములు ఆశ చూపించి, వారి ఆశలను అడియాశలు చేశారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ప్రనాళిక పద్ధతిగా అమలు చేస్తుందన్నారు. ఇప్పటికే 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు, ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.500 రూపాయలకే సిలిండర్, ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షలు ఆరోగ్య ఖర్చులకు ఇచ్చే విధంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సోమవారం నుంచి తొలివిడత ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలును భద్రాచలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారని అన్నారు. తొలి విడత రాష్ట్రవ్యాప్తంగా 95,235 ఇందిరమ్మ ఇండ్లకు గ్రీన్ సిగ్నల్, రూరల్లో 57,141 ఇండ్లు, అర్బన్ లో 38,094 ఇండ్లు ఈ ఆర్థిక ఏడాది 4,16,500 ఇందిరమ్మ ఇళ్లు లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని అన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో 3500 మంది నిరుపేదలకు సొంతింటి కల నెరవేరేందుకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ కృషి చేస్తున్నారని అన్నారు.