మండలంలోని అంకాపూర్ గ్రామానికి చెందిన అత్యంత నిరుపేదలు కూలి పని చేసుకుని జీవించే వ్యక్తులు సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్కు డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు వినతి పత్రం అందజేసినారు. గత 25 సంవత్సరాల నుండి అద్దె ఇళ్ల లో ఉంటూ నరకయాతన అనుభవిస్తున్నామని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 20 14 ఆగస్టు 7న అంకాపూర్ గ్రామాన్ని సందర్శించి రాష్ట్రంలోనే మొట్టమొదట ఇక్కడే రెండు పడక గదుల ఇండ్లు నిర్మించి ఇచ్చి తీరుతామని హామీ ఇచ్చి పది సంవత్సరాలు గడిచినట్టు తెలిపారు.. ఇండ్ల నిర్మాణం చివరి దశకు చేరుకున్న పంపిణీ జరగలేదని సొంత ఇండ్లు లేక కిరాయిలు చెల్లించలేక పెరిగిన నిత్యవసర ధరలతో ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నామని ,మానవతా దృక్పథంతో ఇబ్బందులను తొలగించాలని వారు కోరినారు.
ఈ కార్యక్రమంలో గుండ్ల భారతి పోసాని హిమ రాజ్ నరసయ్య ,కృష్ణ తదితరులు పాల్గొన్నారు.