ఆశా వర్కర్లకు పెండింగ్ లో ఉన్న లెప్రసీ సర్వే డబ్బులు చెల్లించాలి: సీఐటీయూ

– ఆర్టీఓ కార్యాలయం ముందు ధర్నా
నవతెలంగాణ – అచ్చంపేట 
తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సీఐటీయూ  అనుబంధం ఆధ్వర్యంలో ఆశా వర్కర్లకు లెప్రసీ సర్వే చేసిన 2022-   2023 వ సంవత్సరం పెండింగ్ లో ఉన్న బకాయి డబ్బులు చెల్లించాలంటూ అచ్చంపేట ఆర్డీవో కార్యాలయంలో ఆశ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ మల్లేష్ , ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కే రజిత , రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎల్. దేశ నాయక్  మాట్లాడారు. ఆశా వర్కర్లతో ప్రభుత్వo పనులు చేయించుకుంటూ.. సంవత్సరం పాటు డబ్బులు ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. ఏడాదికి నాలుగుసార్లు లెప్రసీ సర్వే చేయించుకుని, ఒక్కొక్కరికి రూ.4000 రూపాయలు ఇవ్వాల్సి ఉండగా అట్టి డబ్బులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసి నారు లెప్రసీ పెండింగ్ డబ్బులు ఇస్తేనే ఆశ వర్కర్లు లేప్రోసి సర్వే చేస్తారని అన్నారు. వీటితోపాటు పల్స్ పోలియో, ఆల్బెండజోల్ టాబ్లెట్లు పంపిణీ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేసిన దేనికి ప్రభుత్వం నుంచి డబ్బులు ఇవ్వడం లేదన్నారు. అందుకే ఇప్పుడు సర్వే చేయమని ఆశ వర్కర్లు ప్రభుత్వానికి నిరసన చేయడం జరిగిందన్నారు. అన్ని రకాల రిజిస్టర్లు ప్రభుత్వమే ఇవ్వాలి,  కనీస వేతనము రూ.26 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.  కొత్త ప్రభుత్వం వచ్చిందని కోటి ఆశలతో ఎదురుచూసిన నిరాశనే మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆశా వర్కర్లకు రావలసిన పెండింగ్ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు, సైదమ్మ , శివ లీల, లక్ష్మి , పారిజాత, మణెమ్మ , మన్ననూరు, పీహెచ్ఎస్సి నుండి శ్యామల పద్మ , ఉప్పునుంతల పిహెచ్సి నుండి శ్రీమతమ్మ, పద్మ లింగాల, అంబటి పళ్లి పీహెచ్సీల నుండి ఆశ వర్కర్లు బల్మూరు పీహెచ్సీ నుండి లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.