
మండల పరిధిలోని మిర్యాల గ్రామంలోని రెండో భద్రాదిగా పేరుగాంచిన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం కమిటీ చైర్మన్గా గోరుగంటి రామచంద్ర రావు ను సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లుగా మాజీ సర్పంచ్ మెంచు చక్రయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకుడు దరిపెల్లి వీరన్న తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైస్ చైర్మన్ గా మంచు వెంకన్న డైరెక్టర్లు గా ఏర్పుల కొమరమల్లు, కాసం ప్రసాద్, ఇరుగు దివ్య, కాట్ల రేణుక ,కొమ్ము రవీందర్ ను ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ,మన్నెం దశరద,నాయకులు ఇరుగు కిరణ్ , యామగాని రమేష్ ఏల్పుల లింగయ్య,గుణగంటి వెంకన్న ,ఆనంతుల శ్రీనివాస్, రఘు,తదితరులున్నారు.