సికింద్రాబాద్ తరలిన డ్వాక్రా మహిళలు..

నవతెలంగాణ నాగిరెడ్డిపేట్: నాగిరెడ్డిపేట మండలం నుండి సికింద్రాబాద్ కు 100 మంది డ్వాక్రా మహిళలు తరలి వెళ్లినట్లు ఏపీఎం జగదీష్ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో మహిళా సంఘాలకు వడ్డీ రాయితీ తదితర అంశాలపై మహిళా సంఘాలతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారని ఆయన పేర్కొన్నారు. నాగిరెడ్డిపేట మండలంలోని జలాల్పూర్ గ్రామం నుండి ఒక బస్సు గోపాల్పేట నుండి ఒక బస్సు రెండు బస్సులలో 100 మంది డ్వాక్రా మహిళలు తరలినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఎంపీపీ రాజుదాస్ ప్రారంభించారు. ఆయన వెంట ఏపిఎం జగదీష్ ఐకెపి సిబ్బంది ఉన్నారు.