విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పంపిణీ

నవతెలంగాణ-భిక్కనూర్ : మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామంలో జిల్లా పరిషత్ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు, పెన్నులను వాసవి క్లబ్ అధ్యక్షులు అల్లాడి సుదర్శన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి శ్రీనివాస్, సభ్యులు లింగం, బాలాజీ, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.