– పాల్తీ తండాలో 100 ఎకరాలకు పైగా ఎండిన పంట పొలాలు.
– ఎండిన పంటల పై ఆశలు వదులుకొని పశువులను మేపుతున్న రైతులు
– డిస్ట్రిబ్యూటరీ కాలువకు నీటి విడుదల చేయక నిలువున ఎండుతున్న పొలాలు
నవతెలంగాణ -పెద్దవూర : మండలంలోని పలు గ్రామాల్లో ఏఎంఆర్పీ డిస్ట్రిబ్యూటరీ కాలువల ఆయకట్టు కింద రైతులు వేసిన వరి పంట చేతికి వచ్చేసరికి నీరు అందక ఎండిపోయాయి.బోర్లు, బావుల్లో భూగర్భ జలాలు అడుగంటి పోయేసరికి రైతులు చేసేదేమీలేక పంటపై ఆశలు వదులుకొని పశువులను మేపుతున్నారు.సాగర్ నుండి ఒక తడి నీరు విడుదల చేస్తే కొంత మేరకు పంటలను కాపాడే అవకాశం ఉంటుందని,ఒక పది రోజులు నీళ్ళు విడుదల చేసి ఎండిపోతున్న పంట పొలాలను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అలాగే మినప, వేరుశనగ ఈ ఏడాది రైతులకు నష్టాలను మిగిల్చింది. కష్టపడి సాగు చేసినా కాలం కలిసి రాలేదు.పెద్దవూర మండలం సుద్దబావి తండాలో కాపులేని మినప చేనులో పశువులను వదిలేసి మేపుతున్నారు.
పాల్తీ తండా లోనే ఎండిన 50 ఎకరాలు పొలాలు
మండలం లోని పాల్తీ తండాలో దాదావు,40 మంది రైతులకు సంబందించిన ఎకరం, అరేకరం సాగుచేసిన దాదాపు 50 ఎకరాలలో వరిపంట ఎండిపోయింది. దాంతో పశువును మేపు టున్నారు.మండలం రబీ లో వరి సుమారు 21 వేల ఎకరాలులో వరి సాగు చేశారు.
గ్రామం లో పాల్తీ బాబురావు 2ఎకరాలు,పాల్తీ రవి, 2 ఎకరాలు,పాల్తీ రఘు 2 ఎకరాలు,పాల్తీ బాజ్య 2ఎకరాలు,పాల్తీ మంగ్ల ఎకరం,పాల్తీ శంకర్ ఎకరం, పాల్తీ రాందాసు ఎకరం, పాల్తీ రఘురాం ఎకరం, వీరు గాక ఇంకా 50 మంది రైతులు ఎకరం, రెండు ఎకరాలు, అరెకరం సాగుచేసిన రైతులు కళ్ల ముందే వేసిన పంట పొలాలు ఎండిపోయాయి.పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొంది.పొలంలో పశువులను విడిచిపెట్టి మేపు టున్నారు.మినప,వేరు శనగ
వంటి పంట ఈ ఏడాది రైతులకు నష్టాలను మిగిల్చింది. కష్టపడి సాగు చేసినా కాలం కలిసి రాలేదు. ఫలితంగా కాపులేని చేనులో పశువులను వదలాల్సిన దుస్థితి నెలకొంది. ఖరీఫ్ వరి సాగు అనంతరం మండలంలోని పలు గ్రామాల్లో రైతులు ఆయా పొలాల్లో మినప , జనుము పంటను వేశారు. సుమారు ఐదు వందల హెక్టార్లలో సాగు చేపట్టారు. అయితే ఈ ఏడాది కాపు సరిగా లేకపోవడంతో అంతా దిగులు చెందుతున్నారు. పాల్తీ తండా, పర్వేదుల, చలకుర్తి, పెద్దవూర, తుంగతుర్తి, బట్టుగూడెం,పోతునూరు, పినవూర, ఉట్లపల్లి, పులిచర్ల, కోమటి కుంట తండా, నీమా నాయక్ తండా, కుంకుడు చెట్టు తండా,తదితర గ్రామాల్లో
ఎక్కువగా ఈ పంటలను వేశారు. వరి పంటలో గిట్టుబాటు లేకపోవడంతో కనీసం అపరాలైనా కలిసి వస్తాయని గంపెడాశ పెట్టుకున్నారు. అయితే ఆశించిన మేర ఫలితం దక్కకపోవడంతో వారంతా ఆయా పంట పొలాల్లో పశువులను విడిచిపెట్టి మేపుకుంటున్నారు. ఎకరా భూమిలో మినప సాగుకు విత్తనాలు, పురుగు మందుల పిచికారీ తదితరాలకు సుమారు 15 వేల రూపాయల వరకు వెచ్చించినట్టు చెపుతున్నారు. కనీసం పెట్టుబడులు కూడా రాని దుస్తుతి ఏర్పడిందని అంటున్నారు.
పాల్తీ తండా, చలకుర్తి,పర్వేదుల గ్రామాల్లో ఈ పంట దిగుబడి లేకపోవడంతో చేసేది లేక ఆయా రైతులు పంటను పశువులకు మేపుతున్నారు.
వ్యవసాయంలో ఏటేటా ఇలా నష్టాలు వస్తుండడంతో మున్ముందు సాగును ఎలా చేయాలో ఏమిటో అర్థం కావడం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా
ఏఎమ్ఆర్పీ 8,9 డిస్ట్రిబ్యూటరీ కాలువకు, అలాగే ఎడమ కాలువకు 10 రోజులు నీటి విడుదల చేస్తే కొంతవరకు భూగర్భజలాలు పెరిగే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
రెండు ఎకరాలు పొలం పూర్తిగ ఎండి పోయింది.
పాల్తీ మంగ్ల నాయక్ పాల్తీ తండ
నాకున్న రెండు ఎకరాలలో వరి పంట సాగు చేశాను. బోరు పూర్తిగా ఎండి పోయింది. చుక్క నీరు కూడా రావడం లేదు. ఏ ఎం ఆర్పీ 8,9డిస్ట్రిబ్యూటరీ కాలువకు నీళ్లు విడుదల చేస్తారని అనుకున్నాము. కానీ నీళ్లు విడుదల చేయక పోవడంతో పొలం పూర్తిగా ఎండి పోయింది.