స్వయం స్వపరిపాలన దినోత్సవం

నవతెలంగాణ-పెద్దవూర : మండలంలోని వెలమ గూడెం స్కూల్ కాంప్లెక్స్ పరిది లోని కొత్తగూడెం ప్రాథమిక పాఠశాలలో స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు గవ్వ హిమావంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం స్వయం స్వపరి పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.కలెక్టర్ గా అటికం వాసంతి, డీఈఓ గా అటికం చామంతి,ఎంఈఓ దుగ్యాల వెన్నెల, ప్రదానోపాధ్యాయులుగా ఆవుల శైలజ, ఉపాధ్యాయులుగా కత్తి విజితా రెడ్డి, పిట్టల జ్యోస్నా, ఆవుల నాగరాజు,స్వపరిపాలన దినోత్సవంలో భాగంగా ఒక్క రోజు ఉపాధ్యాయులు తమ విధులు నిర్వహించారు. ఈసందర్బంగా విధ్యార్థులు ఉపాధ్యాయ వృత్తిలో తమ తమ అనుభవాలను విధ్యార్థులతో, ఉపాధ్యాయులతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వెంకట రమణ, సీఆర్పీ పల్లె బోయిన శంకర, ఉపాధ్యాయులు వసంత, లక్ష్మి పాల్గొన్నారు.