పోలింగ్ బూత్ లలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలీ

నవతెలంగాణ – జుక్కల్

పోలింగ్ బూత్ లలో అన్ని సౌకర్యాలు ఓటర్లకు కల్పించాలని జుక్కల్ ఎంపిడివో శ్రీనివాస్ అన్నారు. మంగళ వారం నాడు మండలంలోని పడంపల్లి ప్రభూత్వ ప్రాథమీకోన్నత పాఠశాలలో నిర్వహించే సదుపాయాలైన మరుగుదొడ్లు, మూత్రశాలలు, భవనం ను పరీశీలించారు. అనంతరం పాఠశాలలోని విద్యార్థులతో మాట్లాడారు. మద్యహన బోజనం మెను ప్రకారం పెట్టాలని, ఎంతమంది ఉపాద్యాయులు ఉన్నారని, విధులకు ఎంతమంది హజరయ్యారని ఉపాద్యాయుడు ఉమాకాంత్ ,  కవిత ను అడిగి తెలుసుకున్నారు.  వచ్చే ఎన్నికలలో  భాగంగా ముందస్తుగా పోలింగ్ బూత్ లను పరీశీలించి నివేదికలను జిల్లా అధికారులకు పంపిస్తామని తెలిపారు. ఎంపిడివో తో పాటు జీపీ కార్యదర్శి మీరేవార్ గంగాధర్, రాజ్ కూమార్, ఉపాద్యాయులు ఉమాకాంత్, కవిత తదితరులు ఉన్నారు.
– ఫోటో:- పడంపల్లి పోలింగ్ బూత్ ను పరీశీలిస్తున్న ఎంపీడీవో శ్రీనివాస్.