ప్రారంభమైన వేణుగోపాలస్వామి బ్రహ్మౌత్సవాలు

– చరికొండ గ్రామంలో వారం రోజుల పాటు కొనసాగనున్న వేడుకలు
నవతెలంగాణ-ఆమనగల్‌
కడ్తాల్‌ మండలంలోని చరికొండ గ్రామంలో కొలువైన, భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణు గోపాల స్వామి బ్రహ్మౌత్సవాలు మంగళవారం నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వారం రోజులపాటు కొనసాగే ఉత్సవాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. పురాతన ఆలయంగా గుర్తింపు పొందిన వేణు గోపాల స్వామి ఆలయంలో ప్రతి ఏటా బ్రహ్మౌ త్స వాలు నిర్వహించడం సంప్రదాయం. భక్తుల కోరి కలు తీర్చే జగత్‌ రక్షకుడిగా శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ఈ ప్రాంతంలో ప్రత్యేక గుర్తింపు పొంద డంతో ఉత్సవాలకు కడ్తాల్‌ మండలంతో పాటు సమీప మండలాలైన కందుకూరు, యాచారం, ఇబ్రహీంపట్నం, దేవరకొండ, చింత పల్లి, ఆమన గల్‌, మాడ్గుల తదితర ప్రాంతాలకు చెందిన భక్తులు వేలాదిగా తరలి వస్తుంటారు. ఉత్స వాల కోసం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా విద్యుత్‌ దీపాలతో శోభాయమానంగా అలంక రించారు.
– ఉత్సవాల వివరాలు..
మంగళవారం అభిషేకం, స్వస్తి హావచనం, రుత్వీగరణం, అంకురార్పణంతో ఉత్సవాలు ప్రారం భమై 13వ తేదీ బుధవారం ధోజారోహణ, భేరి పూ జ, దేవతాహ్వానం, గురువారం మోహినిసేవ, విష్ణు సహస్రనామం, అర్చన, గరుడసేవ, ఎదు ర్కొల్లు, శుక్రవారం శ్రీవారి కల్యాణ మహౌత్సవం, రాత్రికి రథోత్సవం, శనివారం అభిషేకం, కుంకు మార్చన, ఆంజనేయస్వామికి మహాభిషేకం, అష్టో త్తర నామా వళి, లంకాదహనం, ఆదివారం పూర్ణా హుతి, చక్ర తీర్థం, బండ్ల పూజలు, పుష్పయాగం, ద్వాదశ ఆరా ధన, దేవత విసర్జనం, ధ్వజారోహణం, శేష వాహ నం, పవలింపు సేవలతో స్వామివారి ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ ఈఓ మోహన్‌ రావు వివరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఉత్సవాలకు హాజరుకావాలనిఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు.