– దళిత సంఘాలు డిమాండ్
నవ తెలంగాణ – మహబూబ్ నగర్
కోయిలకొండ మండలం అనంతపురం( కొత్తపల్లి) గ్రామంలో దళిత యువకులు శివ స్వాములను కులం పేరుతో దూషించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. మంగళవారం కోయిలకొండ ఎమ్మార్వో ఆఫీస్ ముందు దళిత ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపి ఎమ్మార్వో వినతిపత్రం అందించారు.ఈ సందర్భంగా జేయంఐవీ, కేవీపీఎస్ , ఎన్‌ఏఏడబ్ల్యూ, టీఎస్ డబ్ల్యూయూ, టీవీయూ నాయ కులు రాష్ట్ర జిల్లా నాయకులు కంచి లక్ష్మణ్, ఎం కురుమయ్య, మట్ట గళ్ళ వెంకటయ్య, నాగన్న, ఎం శ్రీనివాసులు మాట్లాడుతూ అనంతపురం గ్రామంలో దళితుల శివమాలవేసి ఇరుముడి కట్టుకొని శివరాత్రికి శ్రీశైలం వెళ్లే సందర్భంగా శివ స్వాములు బంధువులందరూ గుడి దగ్గరికి వెళితే గ్రామానికి చెందిన ఆధిపత్య కులాల వాళ్ళు దళితులు గుడిలోకి రావడం వల్ల మా గ్రామంలో ఒక్కొక్కరు చనిపోతున్నారరు. కావున మీరు గుడిలోకి రావద్దు. వస్తే మీరే గుడి పెత్తనం తీసుకోవాలి మేము రాము అని బెదిరించారు. కాకుండా గుడికి ఉన్న అప్పు రెండు లక్షలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు ఆరోజు జరిగిన ఘటనను మార్చి 10వ తారీకు వాయిదా వేసి 10వ తేదీన దళితులను గ్రామపంచాయతీ కార్యాలయం పిలిపించి పంచాయతీ పెట్టి మీరు గుడిలోకి రావద్దని గుడికి తాళం వేశారు. పంచాయతీలు అందరి ముందు దళితులను అనేక రకాలుగా అవమానించి కులం పేరుతో దూషించిదాడి చేసే ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలిసి ఈ రోజు కోయిలకొండ మండల ఎస్సై గ్రామానికి వెళ్లి దళితులను గుడిలోకి తీసుకెళ్లారు. ఎస్సై ముందరనే ఆధిపత్య కులాలకు చెందినవారు, దళితులను గుడిలోకి తీసుకెళ్తే గుడిలోకి రాము నిర్వహణ వాళ్లే చూసుకోవాలనే కరాకండిగా చెప్పారు. ఎస్సై ముందే ఇంత అహంకారంగా మాట్లాడిన వారు దళితులపై దాడి చేసే అవకాశముందన్నారు. కావున దళితులకు రక్షణ కల్పించాలన్నారు. కులం పేరుతో దూషించి దాడికి ప్రయత్నం చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ దష్టికి తీసుకెళ్తామని వారు తెలిపారు. ఎమ్మార్వో డీఎస్పీ ఆ గ్రామాన్ని సందర్శించాలని వారు కోరారు. కార్యక్రమంలో కేవీపీఎస్ ్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం మాణిక్యం రాజు, మాల మహానాడు జిల్లా కార్యదర్శి బండి నాగరాజు, రాజు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు భరత్, బాధితులు రాజు శివ , రాము తదితరులు పాల్గొన్నారు