నవ తెలంగాణ- మహబూబ్ నగర్
టాస్క్ సంస్థ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్‌లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పాటు డెవలప్మెంట్ హబ్బుగా తీర్చి దిద్దుతామని స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మంగళవారం హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంక్ దగ్గర గల టాస్క్ కార్యాలయంలో టాస్క్ సీఈవో శ్రీకాంత్‌తో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాసరెడ్డి,మహబూబ్ నగర్ పట్టణంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు గురించి చర్చించారు.ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఐటిఐ ఒకేషనల్ ఇంటర్, డిగ్రీ కళాశాలలో చదువు తున్న విద్యార్థులకు వేలాదిమంది యువతకుఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా సరియైన కోర్సుల లో నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ లలో శిక్షణ ఇప్పించి వారి యొక్క స్కిల్స్ ను ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో టాస్క్ సంస్థ ఆధ్వర్యంలో రాబోవు రెండు మూడు వారాలలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభం చేయబోతున్నట్టు ఆయన తెలిపారు.అనతి కాలంలోనే ఈ సెంటర్‌ను మహబూబ్ నగర్ పట్టణంలో స్కిల్ డెవలప్మెంట్ యూని వర్సిటీగా రూపాంతరం చేయడానికి కషి చేస్తున్నట్టు ఆయన తెలిపారు.అలాగే మహబూబ్‌నగర్ పట్టణంలో స్కిల్ డెవలప్మెంట్ బిల్డింగ్ నిర్మాణానికి అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ద్వారా 20 కోట్ల రూపాయలను ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. మహబూబ్ నగర్ ను స్కిల్ డెవలప్మెంట్ హబ్ గా మార్చేందుకు సహకరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎ రేవంత్ రెడ్డి గారికి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు కోసం అనుమతి ఇచ్చిన రాష్ట్ర ఐటి శాఖ మంత్రి శ్రీ శ్రీధర్ బాబు కు, టాస్క్ సీఈవో శ్రీకాంత్ కు సందర్భంగా ఎమ్యెల్యే కతజ్ఞతలు తెలియజేశారు.