– కాంగ్రెస్ నాయకులు బి.కృష్ణ
వనపర్తి: డబుల్ బెడ్రూం ఇండ్ల కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, కాంగ్రెస్ నాయకులు బి.కష్ణ అన్నారు. మంగళవారం వనపర్తి పట్టణంలోని చిట్యాల రోడ్డులో ఉన్న డబుల్ బెడ్రూం కాలనీని ఆయన సందర్శించారు. కాలనీ మొత్తం తిరిగి సమస్యలను, సౌకర్యాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మంచినీటి సమస్య, డ్రైనేజీ, విద్యుత్ దీపాలు, సీసీరోడ్లు, సెప్టిక్ ట్యాంక్ తదితర సమస్యలను ఆయన దష్టికి తెచ్చారు. మంచినీటి సౌకర్యం లేక చాలామంది డబుల్ బెడ్రూం ఇండ్లలోకి రావడం లేదన్నారు. నీటిసమస్య, డ్రైనేజీ సమస్యలు పరిష్కారమైతే లబ్ధిదారు లందరూ ఇక్కడ నివాసం ఉంటారని కాలనీవాసులు ఆయన దష్టికి తెచ్చారు. దీనికి స్పందించిన ఆయన ఈ పనులు పూర్తి కావాలంటే రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్ ను ఇక్కడికి తీసుకొచ్చి ఈ సమస్యలను వారి దష్టికి తెస్తానన్నారు. చిన్నారెడ్డి వనపర్తికి వచ్చిన వెంటనే సమయం తీసుకుని కలెక్టర్ తో పాటు ఈ కాలనీని సందర్శిస్తామని చెప్పారు. చాలా సమస్యలు ఇక్కడ పెండింగ్ లో ఉన్నాయని వారు వస్తేనే వెంటనే పరిష్కారం అవుతాయని చెప్పారు. దీంతోపాటు మిషన్ భగీరథ మంచినీటి సరఫరా చేసే విధానంపై కమిషనర్ తో మాట్లాడుతానని, ప్రస్తుతం 3 బోర్లు ఉన్నాయని, ఆ బోర్లకు మోటర్లు బిగించి నీటి సరఫరా చేయిస్తామని హామీ ఇచ్చారు.