ప్రమాదకరంగా ఉన్న బురుజులను పరిశీలించిన కలెక్టర్

– మార్చి నెల చివరి కల్లా బురుజులు కూల్చేందుకు చర్యలు
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో గల భారీ బురుజులు ప్రమాదకరంగా ఉండటంతో వాటిని జిల్లా కలెక్టర్ జితిస్వి పాటిల్ బుధవారం నాడు సందర్శించి పరిశీలించారు. ప్రతి వర్షాకాలంలో ప్రమాదకరంగా ఉన్న బురుజుల పట్ల హాని జరుగుతుందని భయం ప్రజల్లో నెలకొనడంతో ఈపాటికి ప్రమాదకరమైన బురుజుల పట్ల హానీలు జరిగిన సంఘటనలు ఉన్నాయి. అలాంటి ప్రమాదకరమైన బురుజులు కూల్చేందుకు జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. బురుజులు కూల్చాలంటే భారీ ప్రోక్లింగులు కావాలి ప్రస్తుతం మన దగ్గర ఉన్న వాటిని తో కూల్చడానికి సరిపోవని భారీ యంత్రాలు అవసరమని అలాంటి యంత్రాలు ఎక్కడ లభిస్తే అక్కడనుండి తీసుకురావడానికి ప్రభుత్వపరంగా చర్యలు తీసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, భారీ ప్రోక్లింగ్ అడ్రస్ కనుక్కొని తమకు తెలియజేయాలని మద్నూర్ గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి డాక్టర్ బండివార్ అలాగే గ్రామ కార్యదర్శి సందీప్ కుమార్ లకు ఆదేశాలు ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో మార్చి నెలాఖరులోగా ప్రమాదకరంగా ఉన్న బురుజులు కూల్చే ప్రయత్నం చేద్దామని, ఆ పనిలో మీరు ఉండాలని పంచాయతీ ప్రత్యేక అధికారికి గ్రామ కార్యదర్శికి సూచించారు. ప్రమాదకరంగా ఉన్న బురుజుల పరిశీలనలో కలెక్టర్ వెంట స్థానిక తహసిల్దార్ ఎండి ముజీబ్ ప్రత్యేక అధికారి డాక్టర్ బండివార్ విజయ్ గ్రామ కార్యదర్శి సందీప్ కుమార్ బూర్జు ప్రాంత ప్రజలు పాల్గొన్నారు.