టూర్లకు వెళ్లే ప్రయాణంలో నా కుటుంబం అనే విధంగా డ్రైవర్లు వాహనాలు నడపాలి: ఎమ్మెల్యే

– డ్రైవర్ల అసోసియేషన్ కార్యాలయ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు
నవతెలంగాణ – మద్నూర్
టూరుకు వెళ్ళే ప్రయాణంలో నా కుటుంబం అనే విధంగా డ్రైవర్లంతా సక్రమంగా వాహనాలు నడపాలని డ్రైవర్ల అసోసియేషన్ సభ్యులకు తాను ఎల్లవేళలా అండగా ఉంటానని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు తెలిపారు. మద్నూర్ మండల కేంద్రంలో డ్రైవర్ అసోసియేషన్ కమిటీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే బుధవారం ప్రారంభించారు. కార్యాలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావుకు డ్రైవర్ అసోసియేషన్ అధ్యక్షులు మగ్దూం ఆధర్యంలో డ్రైవర్లు ప్రత్యేకంగా సన్మానించారు. పలువురు డ్రైవర్లకు ఎమ్మెల్యే చేతుల మీదుగా ఐడెంటి కార్డులు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి డ్రైవర్ లైసెన్స్ కలిగి ఉండాలని ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని రకాల డాక్యుమెంట్లు ఉంచుకోవాలని వాహనం నడిపే ముందు నా కుటుంబమే ప్రయాణిస్తుంది అనే ఉద్దేశంతో వాహనాలు సక్రమంగా నడుపుకోవాలని ఎమ్మెల్యే డ్రైవర్లకు సూచించారు. డ్రైవర్ల వృత్తిపరంగా ఎలాంటి పనికైనా తాను ఎల్లవేళల అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంటా కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు మండల నాయకులు పాల్గొన్నారు.