యాదవ కార్పొరేషన్ ఏర్పాటుపై హర్షం

నవతెలంగాణ – ఉప్పునుంతల
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాదవ కార్పొరేషన్ ఏర్పాటు ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తూ నాగర్ కర్నూలు జిల్లా యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో బుధవారం ఉప్పునుంతల మండల కేంద్రంలో జిల్లా అధ్యక్షులు కుందేళ్ల శంకర్ యాదవ్,ఉపాధ్యక్షుడు బోడ శేఖర్ యాదవ్ ,ఉప్పునుంతల మండల అధ్యక్షుడు దుడ్డు శ్రీను యాదవ్, బాల్మూర్ మండల అధ్యక్షుడు వావిల్లా విష్ణు వర్ధన్ యాదవ్ ల అధ్యక్షతన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇడమోని మల్లేష్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జాతీయ అధ్యక్షులు యాదవ యుద్దనౌక మేకల రాములు యాదవ్ గత 15 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో భాగంగా ధర్నాలు, రాస్తారోకాలు, అసెంబ్లీ ముట్టడి లాంటి ఎన్నో పోరాటాల కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వాలను ప్రశ్నించడం వల్లనే రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన యాదవులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సుదీర్ఘ పోరాటం చేయడం వలనే తెలంగాణ రాష్ట్రంలో యాదవ కురుమ కార్పొరేషన్ ప్రకటన తెలంగాణ రాష్ట్రంలో సాధ్యమైందని ఆయన అన్నారు. గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేకల రాములు యాదవ్ ఆధ్వర్యంలోనే కార్పొరేషన్ ఏర్పాటు సాధ్యమైందని ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆయన ద్వారానే కార్పొరేషన్ సాధ్యమైందన్నారు. కార్పొరేషన్ ప్రకటనలకు మాత్రమే కాకుండా రాష్ట్ర బడ్జెట్లో పదివేల కోట్లు నిధులు కేటాయించి యాదవ జాతి అభివృద్ధికి పూర్తి తోడ్పాటు అందించాలని వారు కోరారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా యాదవ జాతి ముద్దుబిడ్డలు తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బల్మూర్ మండల సోషల్ మీడియా కన్వీనర్ జబ్బు లక్ష్మణ్ యాదవ్, తెలకపల్లి మండల ఇంచార్జి జల్లెల్ల శ్రీనివాస్ యాదవ్,గునేమోని ఎల్లయ్య యాదవ్,ఆకమోని సైదులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.