
ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకి ఆమోదం తెలిపిన సందర్బంగా తుర్కపల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి బుదవారం ఆర్యవైశ్య సంఘం తరపున పాలాభిషేకం చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి తుర్కపల్లి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వెల్ది కనకరాజు, సభ్యులు తడక బాలరాజు, చింత లక్ష్మయ్య, కందుకూరి బాలరాజు, కందుకూరి అమర్నాథ్, బచ్చు నాగరాజు, నీలా సునీల్ కుమార్, సముద్రాల నరసయ్య, కందుకూరి లక్ష్మీనారాయణ, కుకుటపు పవన్ కుమార్, కుకుటపు నవీన్ కుమార్ ,సముద్రాల వెంకటేశు, జిల్లా శ్రీనివాసు చింత నరసింహులు, రేగొండ నవీన్ కుమార్, కందుకూరు వేణు, పబ్బ శ్రీనివాస్, కందుకూరి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.