ఏకగ్రీవం అయిన కొబ్బరి సొసైటీ ఎన్నిక..

నవతెలంగాణ – అశ్వారావుపేట
కొబ్బరి సాగు దారుల( రైతు) సొసైటీ ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నికైంది.స్థానిక కార్యాలయం లో మంగళవారం రైతు సంఘం బాధ్యులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అచ్యుతాపురం పంచాయితీల పరిధిలో నూతన సొసైటీ ఎన్నిక నిర్వహించారు. అధ్యక్షులుగా సింహాద్రి ప్రసాద్,ఉపాధ్యక్షులుగా సత్తెనపల్లి వెంకటేశ్వరరావు, కార్యదర్శిగా అబ్బిన సురేష్, సహాయ కార్యదర్శిగా సంతపురి చెన్నారావు, కోశాధికారిగా ఎదిరాజు రవిల తో పాటు కార్యవర్గ సభ్యులను కొబ్బరి రైతులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికను కొబ్బరి రైతు సంక్షేమ సంఘం బాధ్యులు అలపాటి రామ్మోహన్ రావు(రాము),కొక్కెరపాటి పుల్లయ్య, బండి భాస్కర్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.