– గుజరాత్ జెయింట్స్ 126/9
న్యూఢిల్లీ: మహిళల ప్రిమియర్ లీగ్(డబ్ల్యుపిఎల్) సీజన్-2 ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు సత్తా చాటారు. అరుణ్‌జైట్లీ స్టేడియంలో గుజరాత్ జెయింట్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ను కాప్, జొన్నాసెన్ కట్టడి చేశారు. దీంతో గుజరాత్ జట్టు 16పరుగులకు టాపార్డర్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో లిచ్‌ఫీల్డ్(21) కాస్త ఫర్వాలేదనిపించినా.. గార్డినర్(12) నిరాశపరిచింది. దీంతో గుజరాత్ జట్టు 48పరుగులకు సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత భారతి(42), బ్రైస్(28నాటౌట్) ఆచి తూచి ఆడి గుజరాత్‌ను ఆదుకున్నారు. వీరిద్దరూ 6వ వికెట్‌కు 68పరుగులు జతచేశారు. ఆ తర్వాత గుజరాత్ మళ్లీ వరుసగా వికెట్లను కోల్పోయింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యేసరికి ఆ జట్టు కేవలం 126పరుగులే చేయగల్గింది. కాప్, శిఖా పాండే, మిన్ను మణికి రెండేసి, జొన్నాసెన్‌కు ఒక వికెట్ దక్కాయి. గుజరాత్, యుపి మహిళల జట్లు ప్లే-ఆఫ్‌నుంచి ఇప్పటికే నిష్క్రమించగా.. ఢిల్లీ, బెంగళూరు, ముంబయి జట్లు ప్లే-ఆఫ్‌కు చేరిన సంగతి తెలిసిందే.
స్కోర్‌బోర్డు…
గుజరాత్ జెయింట్స్ మహిళల ఇన్నింగ్స్: వోల్వోడార్ట్ (సి)షెఫాలీ వర్మ (బి)కాప్ 7, మూనీ (బి)కాప్ 0, హేమలత (బి)జొన్నాసెన్ 4, లిచ్‌ఫీల్డ్ (సి)రాధా యాదవ్ (బి)మిన్ను మణి 21, గార్డినర్ (బి)మిన్ను మణి 12, ఫుల్మలి (బి)శిఖా పాండే 42, బ్రైస్ (నాటౌట్) 28, తనుజ కన్వార్ (బి)శిఖా పాండే 0, షబ్నమ్ (రనౌట్)షెఫాలీ/తానియా భాటియా 1, మేఘన సింగ్ (రనౌట్) తానియా భాటియా/జొన్నాసెన్ 4, మన్నత్ కశ్యప్ (నాటౌట్) 0, అదనం 7. (20 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి) 126పరుగులు.
వికెట్ల పతనం : 1/1, 2/12, 3/16, 4/39, 5/48, 6/116, 7/116, 8/118, 9/122
బౌలింగ్: కాప్ 4-0-17-2, శిఖా పాండే 4-0-23-2, జొన్నాసెన్ 4-0-32-1, రీచా యాదవ్ 2-0-17-0, అరుంధతి 3-0-20-0, మిన్ను మణి 2-0-9-2, అలైస్ కాప్సీ 1-0-3-0