ఇచ్చిన హమీలు నెరవేర్చండి

– మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే మాట ఏమోగానీ ముందు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహిళలకు ప్రతి నెలా రూ. 2,500, ప్రస్తుతం ఉన్న పింఛన్‌ రూ.4,000 మొదలగు హమీలపై సర్కార్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్‌ పార్టీ సాధ్యం కాని హామీలిచ్చిందన్నారు. ఆ పార్టీ పెట్టిన వంద రోజుల గడువు సమీపిస్తున్నా మొత్తం 13 హామీల్లో నాలుగు కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఆచరణకు నోచుకోలేదని విమర్శించారు.