అనదర్‌ హార్వెస్ట్‌ పుస్తకావిష్కరణ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రిటైర్డ్‌ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ మోహన్‌ కందా రచించిన అనదర్‌ హార్వెస్ట్‌ పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మాజీ గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌.నరసింహన్‌ బుధవారం ఉదయం ఆవిష్కరించారు. ఆన్‌లైన్‌లో నిర్వహించిన పుస్తకావిష్కరణకు సంబంధించి ప్రచురణ కర్త దిట్టకవి రాఘవేంద్ర రావు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆగాజ్‌ పోయెట్రీ మూవ్‌మెంట్‌ వ్యవస్థాపకులు, కోశాల లిటరేచర్‌ పెస్టివల్‌ డైరెక్టర్‌ అమితాబ్‌ సింగ్‌ బాఘెల్‌ పుస్తకాన్ని పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ది హాన్స్‌ ఇండియా వార్తాపత్రిక సంపాదకులు రాము శర్మ, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ కార్యదర్శి డాక్టర్‌ సంజరు మూర్తి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం గౌరవ అతిథిలుగా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని అపర్ణ కందా నిర్వహించగా, అరవింద్‌ కందా ముఖ్య అతిథిని పరిచయం చేశారు.