నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఎన్నికల బదిలీల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పలుమార్లు డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేసిన సర్కార్ మరోసారి 18 మందికి స్థానచలనం కలిగించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మిర్యాలగూడ, ఆర్మూర్, అదిలాబాద్, వరంగల్ బోధన్, హుజురాబాద్, హుస్నాబాద్, సిద్దిపేట, బాన్స్వాడ, పెద్దపల్లి, వికారాబాద్ ఆర్డీవోలుగా శ్రీనివాసరావు, స్రవంతి, వినోద్ కుమార్, సిద్దం ధాతు, జి.అంబాదాస్, ఎస్.రమేశ్ బాబు, వి.రామ్మూర్తి, పి.సదానందం, రమేశ్ రాథోడ్, బి.గంగయ్య, మధుమోహన్లను బదిలీ చేసింది. నిర్మల్ (ఎల్ఏ) వి.భుజంగరావు, యాదాద్రి రెవెన్యూ ఆడిషనల్ కలెక్టర్‌గా పి.బెన్షాలోన్, మేడ్చల్ జిల్లా సంక్షేమ శాఖాఖాధికారి (డిప్యూటేషన్)గా బి.రాజాగౌడ్, జగిత్యాల (ఎల్ఏ)గా బి.చెన్నయ్యను నియమించారు. కె.శంకర్‌ను వరంగల్ స్పెషల్ కలెక్టర్(ఎల్ఏ) పీఏగా, ఎ. విజయకుమారిని ఏటూరు నాగారం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గాబదిలీ చేశారు.