– రాష్ట్ర ప్రణాళికా సంఘంఉపాధ్యక్షులు జి. చిన్నారెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం పకడ్బందీగా ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జి చిన్నారెడ్డి అర్ధ గణాంక శాఖ అధికారులకు సూచించారు. బుధవారం హైదరాబాద్‌లోని అర్ధ గణాంక శాఖ, ప్రణాళిక అభివృద్ధి సొసైటీ కార్యాలయాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా కార్యాలయాల్లోని వివిధ విభాగాలను నిశితంగా పరిశీలించారు. ఆయా శాఖల్లో జరుగుతున్న పనుల తీరు శాఖల కార్యకలాపాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పాలనలో వివిధ శాఖలకు గణాంకాలు సర్వే వివరాలు ఇతర సమాచారాన్ని అందించడంలో ప్రణాళిక శాఖ కీలక పాత్రను పోషిస్తోందన్నారు.