నవ తెలంగాణ మల్హర్ రావు:
విద్యార్థులు చదువుల్లో రాణించి తల్లిదండ్రులకు,ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకరావాలని తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు ఆకాంక్షించారు.బుధవారం మండలంలోని మల్లారం గ్రామంలో రూ.2.05 లక్షలతో నిర్మించిన కస్తూరిబా గాంధీ బాలికల అదనపు విద్యాలయాన్ని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేస్ మిశ్రా, ఎంపిపి మల్హర్ రావు తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఆంగ్ల, తెలుగు మాధ్యమంలో విద్యాబోధన చేయనున్నట్లుగా తెలిపారు.అలాగే విద్యాలయంలో డిజిటల్ ద్వారా విద్యా బోధన చేయనున్నట్లుగా చెప్పారు.అదనంగా గదులు సమగ్ర శిక్షా, అభియాన్ క్రింద నిర్మించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన మూడు నెలల కాలంలోనే ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక సమస్యలను పరిష్కరిస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లుగా చెప్పారు. కేజీబీవీ పాఠశాలలో విద్యాలయానికి సంబంధించి భవన నిర్మాణ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషమని చెప్పారు.విద్యార్థులందరూ గొప్ప మానవ వనరులుగా తయారు కావాలని గొప్ప విద్యాబోధన జరగాలని ఆయన చెప్పారు. 16 సంవత్సరాల క్రితం బాలికలకు సంబంధించిన గర్ల్స్ ఎడ్యుకేషన్ బాలికలకు ప్రోత్సాహంగా సహకారంతో నిధులు ఖర్చు చేసి అనేక పాఠశాలలు నిర్మించినట్లుగా తెలిపారు.అందరినీ విద్యాధికారులు చేయాలని ఆయన ఉపాధ్యాయులకు సూచించారు.విద్యార్థులందరూ ప్రయోజకులై బాగా చదువుకొని టీచర్లుగా పోలీస్, ఐఏఎస్, ఐపీఎస్ వ్యవసాయ అధికారులుగా, ప్రజలకు సేవలు అందించాలని కోరారు. దేశానికి ప్రగతిలో విద్యార్థులందరూ భాగస్వాములు కావాలన్నారు. విద్యావంతులైన తదుపరి రాజకీయాలకు వచ్చి ప్రజలకు సేవలు అందించాలన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పాఠశాలను, కళాశాలలు మంజూరు చేసినట్లుగా, విద్యార్థులుగా తయారైనట్లుగా,వారు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారని గుర్తు చేశారు. ఇది చాలా సంతోషమని చెప్పారు. పేద విద్యార్థులు చదువుకునే విద్యాలయమని బాగా చదువుకోవాలన్నారు.చదువుకోవడం వల్ల గురువులు చాలా సంతోష పడతారని, గురువులు చెప్పేది శ్రద్ధగా విని మంచిగా చదువుకోవాలని సూచించారు. సాంకేతికపరంగా విద్యాబోధన చేయాలని ఈ రోజు టీ షాట్ ద్వారా ప్రతి పాఠశాలలో ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా విద్యాబోధన చేసేందుకు ఉపాధ్యాయులు బోధన చేయడంలో ముందుకు నడవాలని, సాంకేతిక విప్లవం ఉపయోగించుకొని డిజిటల్ క్లాస్ రూమ్స్ తో పాటు ఉపాధ్యాయులు విద్య బోధనలో ప్రావిణ్యతను సాధించుకోవాలని సూచించారు. సాంకేత పరిజ్ఞానంతో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. సిబ్బందికి వేతనాలు పెంచేందుకు సానుకూలంగా ఉన్నామన్నారు.ఆర్థిక పరిస్థితులు సరిగా లేకున్నా గత ప్రభుత్వం అస్త వ్యస్తం చేసినా ఒక్కొక్కటి గాడిలో పెడుతూ సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నామని ఆయన పేర్కొన్నారు. 2008 సంవత్సర ఉపాధ్యాయులు అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నారని వారందరికీ ఉద్యోగ నియామకాలు దాదాపు 1600 మందికి నియామక పత్రాలు అందజేయుటకు క్యాబినెట్ నిర్ణయించినట్లుగా చెప్పారు. ప్రభుత్వము ఏర్పడిన తర్వాత 30 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగులను నియమించి ముందుకు నడుస్తున్నామన్నారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులతో సమానంగా ఇంగ్లీషులో ప్రావీణ్యతను పెంచేందుకు కార్యాచరణ చేపడతామన్నారు.