
ఉప్పునుంతల మండలం మామిళ్ళ పల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీకి ఎంపిటిసి రాజీనామా చేసి శుక్రవారం ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు డా.వంశీకృష్ణ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి కడారి రామ లక్ష్మమ్మ, కుమారుడు రామస్వామి కాంగ్రెస్ పార్టీలో సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కట్ట అనంత రెడ్డి,జిల్లా ఉపాధ్యక్షులు నర్సింహా రావు, ఎంపీపీ అరుణ నర్సింహా రెడ్డి, బిసి సెల్ అధ్యక్షులు తిరుపతయ్య గౌడ్, ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.