బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎంపీటీసీ

నవతెలంగాణ – భీంగల్
మండలంలోని బడా భీంగల్ గ్రామ ఎంపీటీసీ 2 కేతావత్ సంతాలి, ఆమె కుమారుడు వల్లి  శుక్రవారం బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్  రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో  చేరారు.  ప్రజలు కోరుకున్న పరిపాలన  తోపాటు రాష్ట్రంలో అభివృద్ధి కాంగ్రెస్ పాలనతోనే జరుగుతుందని  ఎంపీటీసీ అన్నారు. మండలంలో సునీల్ రెడ్డి నాయకత్వంలో నిరంతరం పనిచేస్తానని  వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోధిరె స్వామి, ఎస్టీ సెల్ అధ్యక్షుడు గోపాల్ నాయక్,సేవాలాల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.