ఇసుజు మోటార్స్ ఇండియా భారతదేశంలో ‘ఇసుజు ఐ-కేర్ ఫ్రీ-సమ్మర్ క్యాంప్’ ను విడుదల చేసింది. · 19 నుండి 24 మార్చ్, 2024 వరకు వినియోగదారులు అన్ని ఇసుజు అధీకృత డీలర్ సర్వీస్ అవుట్లెట్స్ వద్ద ఈ అద్భుతమైన సర్వీస్ ప్రయోజనాలను అందుకోవచ్చు.
నవతెలంగాణ చెన్నై: ఉత్తమ సేవ మరియు యాజమాన్య అనుభవాన్ని అందించుటకు ఇసుజు యొక్క నిబద్ధతను తిరిగి ధృవీకరించే తన నిరంతర ప్రయత్నంలో, ఇసుజు మోటార్స్ ఇండియా తన ఇసుజు డి-మ్యాక్స్ పిక్-అప్స్ మరియు ఎస్యూవీల శ్రేణి కొరకు ఒక దేశ-వ్యాప్త ‘ఇసుజు ఐ-కేర్ ప్రీ-సమ్మర్ క్యాంప్’ ను నిర్వహించబోతోంది. వినియోగదారులకు అద్భుతమైన ప్రయోజనాలను మరియు దేశములో ఈ వేసవిలో సమస్యా-రహితమైన డ్రైవింగ్ అనుభవము కొరకు నివారణాత్మక నిర్వహణ పరీక్షలను అందించాలనేది ఈ సర్వీస్ క్యాంప్ ఉద్దేశము. ‘ఇసుజు కేర్’ యొక్క ప్రయత్నములో భాగంగా 2024 మార్చ్ 19 నుండి 24 వరకు (రెండు రోజులు చేర్చబడినవి) అన్ని ఇసుజు అధీకృత డీలర్ సర్వీస్ అవుట్లెట్స్ లో ప్రీ-సమ్మర్ క్యాంప్ నిర్వహించబడుతుంది. ఈ సమయములో, వినియోగదారులు తమ వాహనాలపై ప్రత్యేక ఆఫర్స్ & ప్రయోజనాలను కూడా అందుకోవచ్చు.
ప్రీ-సమ్మర్ క్యాంప్ అహ్మదాబాద్, బారాముల్లా, బెంగళూరు, భీమవరం, భుజ్, కాలికట్, చెన్నై, కోయంబత్తూర్, ఢిల్లీ, డిమాపూర్, గాంధిధాం, గోరఖ్పూర్, గురుగ్రాం, గువహటి, హైదరాబాద్ (కూకట్‌పల్లి & ఎల్.బి. నగర్), ఇండోర్, జైపూర్, జలంధర్, జమ్ము, జోధ్పూర్, కొచ్చి, కోల్కత్తా, కర్నూల్, లక్నౌ, మధురై, మంగళూరు, మెహసాన, మొహాలి, ముంబై, నాగపూర్, నెల్లూరు, పూణె, రాయ్పూర్, రాజమండ్రి, రాజకోట్, సిలిగురి, సూరత్, తిరుపతి, త్రివేండ్రం, వడోదరా, విజయవాడ , భీమవరం, భువనేశ్వర్, దుర్గాపూర్, జైగావ్, కొల్హాపూర్, లేహ్, మండి, నవీ ముంబై, నోయిడా, తిరుచ్చి మరియు విశాఖపట్టణం లో ఉన్న ఇసుజు యొక్క అన్ని అధీకృత సర్వీస్ సదుపాయాలలో నిర్వహించబడుతుంది. వినియోగదారులు సర్వీస్ బుకింగ్ కొరకు సమీప ఇసుజు డీలర్ అవుట్లెట్ కు కాల్ చేయవచ్చు లేదా https://www.isuzu.in/connecttoservice ను సందర్శించవచ్చు. మరింత సమాచారము కొరకు వినియోగదరులు 1800 4199 188 (టోల్-ఫ్రీ) నంబరుకు కాల్ చేయవచ్చు.