ఆటో డ్రైవర్ స్వామి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల 

– స్వామి కుటుంబానికి రూ.15 లక్షల ఎక్స్గ్రేషియా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించాలి
– ప్రతి ఆటో డ్రైవర్ కు రూ.10 నుంచి 15000 నగదు అందించాలి
– స్కీములు ప్రకటించే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరికి నష్టం కలుగుతుంది అనే విషయాన్ని ఆలోచించుకోవాలి
నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిల్లా కెనాల్ ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ స్వామి, భార్య దేవా లక్ష్మి గురువారం ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు గణేష్ బిగాల శుక్రవారం వారి కుటుంబాన్ని శుక్రవారం  పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది. దానికి మేము వ్యతిరేకం కాదు, మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించే ముందు ఎవరికి నష్టం జరుగుతుంది అనే ఆలోచన చెయ్యాలి,ఆలోచన చేయకపోవడం వల్లే ఈరోజు ఆటో డ్రైవర్ దంపతులు పోషణ భారమై ఆత్మహత్య చేసుకున్నారు. ఆటో డ్రైవర్ దంపతులు ఆత్మహత్య చేసుకోవడం వల్ల వారి కుమారుడు అనాధగా మిగిలాడు.రాష్ట్రంలో రోజుకు ఒకచోట ఆటోడ్రైవర్ ఆత్మహత్యలు జరుగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.ఆటో డ్రైవర్ స్వామి కుటుంబానికి రూ. 15 లక్షలు ఎక్స్గ్రోషియా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించాలి.రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్లకు రూ.10 నుంచి 15 వేల నగదు అందించే విధంగా చర్యలు తీసుకోవాలి.ఉచిత బస్ స్కీం తీసుకువచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల గురించి ఎందుకు ఆలోచన చేయడం లేదు.ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేయాలి.
స్వామి, భార్య దేవా లక్ష్మి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతున్ని ప్రార్థించారు. వారి కుటుంబాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్  నగర అధ్యక్షులు సిర్పరాజు  కార్యదర్శి ఎనగందుల మురళి,సుదాం రవిచందర్, సుజిత్ సింగ్ ,సత్యప్రకాశ్,దారం సాయిల,నవీన్,విక్రమ్ గౌడ్,సాయి, రామడుగు బాలకిషన్,రంగు సీతారాం,సదానంద్, నాయకులు రవి చందర్. రంగు సీతారాం, తదితరులు పాల్గొన్నారు.