పసర పోలీస్ స్టేషన్ ను సందర్శించిన ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శభరిష్ ఐపీఎస్

నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలోని పసర పోలీస్ స్టేషను ను శుక్రవారం ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిస్ పి ఐ పి ఎస్  సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ డాక్టర్ శబరి మండలంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో గల అన్ని గ్రామాల వివరాలను ఎస్ ఐ కమలాకర్ ను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ సిబ్బంది వివరాలు కేసులు జరుగుతున్న తీరు గూర్చి వివరంగా అడిగి తెలుసుకున్నారు.తదనంతరం  స్టేషన్ కు సంబంధించి తగు సూచనలు సలహాలు చేయడం జరిగింది. చివరలో  పోలీస్ స్టేషన్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. కార్యక్రమంలో ములుగు డి.ఎస్.పి ఎన్. రవీందర్, పసర సీఐ వి శంకర్  పాల్గొన్నారు.