నెరవేరిన బీటీ రోడ్డు కల..

– కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజా ప్రభుత్వం… ప్రభుత్వ విప్ బీర్లఐలయ్య
నవతెలంగాణ – బొమ్మలరామారం
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేద ప్రజల ప్రభుత్వమని ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. మండలంలోని చీకటిమామిడి నుండి మర్యల వడపర్తి హైవే వరకు రూ.18 కోట్ల రూపాయలతో బీటీ డబుల్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే చీకటిమామిడి మర్యల వరకు ఉన్న రోడ్డు అధ్వాన పరిస్థితిగా ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లోనే బీటీ డబల్ రోడ్డు మంజూరు చేసుకుంటున్నామని ఆయన అన్నారు. కాజీపేట యావపూర్ నుండి ఎర్రగుంట వరకు డబల్ రోడ్డును రూ.10 కోట్ల రూపాయలతో మంజూరు చేసుకున్నామని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తున్నామని అందులో భాగంగానే ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత కరెంటు, రూ.500 కే గ్యాస్ పథకం అమలు చేశామని, నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల ద్వారా వారి ముఖాల్లో సంతోషం చూడాలని ప్రతి గ్రామానికి 25 ఇందిరమ్మ ఇల్లను మంజూరు చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వమని వారి ముఖాల్లో సంతోషం అనే ఉద్దేశంతోనే రెండు లక్షల రూపాయల రుణామాపిని త్వరలోనే చేయబోతున్నామని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ సందీప్ రెడ్డి, ఎంపీపీ సుధీర్ రెడ్డి,మాజీ సింగిల్ విండో చైర్మన్ మొకు మధుసూదన్ రెడ్డి,ఎంపిటిసిలు హేమంత్ రెడ్డి, శ్రీహరి నాయక్,భగవంతు రెడ్డి, మాజీ సర్పంచ్ చీర సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి దేశెట్టి చంద్రశేఖర్, బొబ్బిలి నర్సిరెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రామిడి శ్రవణ్ ప్రసాద్ రెడ్డి,నంద రాజ్ గౌడ్, ముద్దం శ్రీకాంత్ రెడ్డి, ఈదులకంటి దయాకర్ రెడ్డి,గుర్రం శ్రీనివాస్ రెడ్డి, తిరుమల కవిత, ఏనగండ్ల వీరేశం, బిక్షపతి గౌడ్, హనుమంత్ గౌడ్, జూపల్లి మహేష్ ,చంద్రమౌళి,తదితరులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.