అమెరికా ప్రత్యేక దళాల సిబ్బంది తైవాన్‌లోని కొన్ని ద్వీపాలలో తమ సాయుధ దళాలకు శిక్షణ ఇస్తున్నారని తైవాన్ రక్షణ అథారిటీ చీఫ్ చియు కువో-చెంగ్ గురువారం పత్రికలకు ధవీకరించాడు. ఒక లెజిల్లేటివ్ విచారణ సందర్భంగా తైవాన్‌లో అమెరికాకు చెందిన శాశ్వత సైనిక ఉనికి గురించి మీడియా నివేదికలను ధవీకరించమని సదరు అధికారిని కోరినట్లు ఫోకస్ తైవాన్ వార్తా సంస్థ తన వెబ్సైట్లో గురువారం రాసింది. అమెరికా రక్షణ దళాలకు సంబంధించిన సిబ్బంది తైవాన్ దళాలకు శిక్షణ ఇస్తున్నారని, బలహీనతలను, బ్లైండ్ స్పాట్లను గుర్తించడంలో వారికి సహాయపడుతున్నారని చియు పేర్కొన్నాడు.
అమెరికా సైన్యానికి చెందిన’ గ్రీన్ బెరెట్స్’లో పని చేస్తున్న సిబ్బందిని శాశ్వత శిక్షకులుగా వ్యవహరించడానికి, తైవాన్ ప్రత్యేక విభాగాలను సిద్ధం చేయడానికి మోహరించాలని యోచిస్తున్నట్లు గత వారం అమెరికా మిలిటరీ వార్తా సైట్ స్పెషల్ ఆపరేషన్స్ ఫోర్సెస్ రిపోర్ట్ రాసింది. తైవానీస్ శిక్షణకు అమెరికా సైనిక సిబ్బంది తాత్కాలికంగా పనిచేస్తూవుండే పద్ధతికి ఇది పూర్తిగా భిన్నమైనదన్న విషయాన్ని ఇది సూచిస్తుంది. శాశ్వతంగా తైవాన్ లో తిష్టవేసిన అమెరికా దళాలు చైనా ప్రధాన భూభాగం నుండి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిన్మెన్ దీవులలో ఉన్నాయి.
స్వీయ-పరిపాలనలోవున్న తైవాన్ ద్వీపాన్ని చైనా తన సార్వభౌమ భూభాగంలో భాగంగా చూస్తుంది. తైవాన్ తనను తాను స్వతంత్ర దేశంగా ప్రకటించకోకూ డదని చైనా పదేపదే హెచ్చరిస్తోంది. 1949 నుండి స్వయంపాలనలో వున్న తైవాన్ను యుఎస్‌తో సహా అంత ర్జాతీయ సమాజం సార్వభౌమ రాజ్యంగా గుర్తించలేదు. అధికారికంగా తైవాన్ స్వాతంత్య్రానికి మద్దతు ఇవ్వనప్ప టికీ అమెరికా తైవాన్‌తో భద్రతా సంబంధాలను కొనసాగి స్తోంది. తైవాన్‌పై పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా దూకుడును అరికట్టడానికి తైవాన్ ఎన్హాన్స్డ్ రెసిలెన్స్ యాక్ట్ 2022 ప్రకారం, తైవాన్ భద్రతను పెంచడానికి సంవత్సరానికి 2 బిలియన్ల డాలర్ల వరకు మిలిటరీ గ్రాంట్ల రూపంలో ఖర్చు చేయడానికి 2027 వరకు అమెరికాకు అధికారం ఉంది. తైవాన్‌లో అమెరికా సైనిక సిబ్బంది ఉనికిని చైనా తప్పుపడుతోంది. అమెరికా ఎల్లప్పుడూ తన స్వప్రయోజ నాలకే ప్రాధాన్యత ఇస్తుందని, తైవాన్ చైనా ప్రధాన భూభాగానికి వ్యతిరేకంగా ఉపయోగించేది మాత్రమేనని బీజింగ్ ప్రతినిధి చెన్ బిన్హువా బుధవారం తెలిపాడు. ”సైనిక శిక్షణ కార్యక్రమాలు అని పిలవబడే వాటిని నిర్వహించడానికి అమెరికాతో సన్నిహితంగా ఉండటం ద్వారా తైవాన్ రాజకీయ నాయకత్వం క్రమంగా తైవాన్ ప్రజలను సంక్షోభంలోకి నెట్టివేస్తోంది” అని ఆయన పేర్కొన్నాడు. ‘సైనిక మార్గాల ద్వారా స్వాతంత్య్రం కోరుకునే ప్రయత్నం చేసినా లేదా బాహ్య శక్తులపై ఆధారపడటం ద్వారా స్వాతంత్య్రం కోసం ప్రయత్నం చేసినా అది చివరకు తైవాన్ స్వీయ వినాశనానికి దారి తీస్తుంది’ అని ఆయన హెచ్చరించాడు.