
– ఇంటిని పూర్తిగా కూల్చి వేయడానికి ప్రయత్నించిన ఎమ్మార్వో….
– అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్న ఎమ్మార్వో…
– సమస్యలపై ప్రశ్నిస్తున్నాననే, కక్షపూరితంగానే ఒక్కడి ఇల్లే కూల్చే ప్రయత్నం..
– నిధులు దుర్వినియోగం చేశానని గతంలో అబండాలు వేశారు…
– సీపీఐ మండల కార్యదర్శి బద్దం కృష్ణారెడ్డి ఆరోపణ…
నవతెలంగాణ – కోదాడరూరల్
మా ఇంటిని పూర్తిగా కూల్చివేయాలని ప్రయత్నించడం అప్రజాస్వామీకం అని అనంతగిరి మండలం శాంతినగర్ సిపిఐ మండల కార్యదర్శి బద్దం కృష్ణారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… కమ్యూనిస్టు ననే నాపై అధికార పార్టీ నాయకులు అధికారులు కక్ష సాధింపు చర్యలకు కోల్పడుతున్నారు. ఇటీవల సర్పంచిగా ఉన్నప్పుడు నిధులు దుర్వినియోగం చేశానని నాపై అబాండాలు వేశారు. ఇప్పుడు నా ఇల్లు కూల్చి వేస్తున్నారు. అనంతగిరి మండలం శాంతినగర్ గ్రామంలో కృష్ణారెడ్డి నివాసాన్ని తాసిల్దార్ పూర్తిగా కూల్చి వేయడానికి ప్రయత్నం చేశారని ఆరోపించారు.. దీంతో ఆయన వర్గీయులు ఇంటి ముందు ఆందోళన చేశారు .శాంతినగర్ గ్రామం గుండా 365ఏ జాతీయ రహదారి విస్తరణ సందర్భంగా కృష్ణారెడ్డి ఇంటికి కొంత భాగం అధికారులు మార్క్ చేశారు. అంతవరకు ఇంటిని కూలగొట్టి రహదారికి ఇస్తానని కృష్ణారెడ్డి తెలిపారు. కాగా తాసిల్దార్ పూర్తిగా ఇంటిని జెసిబి తో పెకిలించడంతో ఇల్లు మొత్తం కదిలింది. దీంతో కృష్ణారెడ్డి ,వర్గీయులు ఆందోళన వ్యక్తం చేశారు. తాసిల్దార్ కావాలని అధికార పార్టీకి కొమ్ము కాస్తూ మాపై కక్ష సాధింపుగా ఇంటిని కూల్చివేయడానికి ప్రయత్నం చేస్తున్నాడని తెలిపారు. జాతీయ రహదారి విస్తరణ కోసం ఎంతవరకు మార్క్ పెట్టు కుంటే అంతవరకు కూల్చాతనని తెలిపారు. దానికోసం గత వారం రోజులుగా 2 లక్షల రూపాయలతో స్వయంగా మార్కు వరకు ఇంటిని కట్ చేయిస్తున్నని తెలిపారు. అయినప్పటికీ తాసిల్దార్ అవేమీ పట్టనట్లుగా, శనివారం ఉదయం నేరుగా మా ఇంటి వద్దకు వచ్చి నీకు రోడ్డు విస్తరణలో భాగంగా ఇంటి మొత్తానికి డబ్బులు వచ్చాయి కాబట్టి, ఆర్ఓడబ్ల్యు పెట్టిన మార్కుతో పాటు మొత్తం ఇంటిని కూల్చుతానని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సార్ ….ప్రభుత్వ నిబంధన ప్రకారం మార్కింగ్ కూల్చండి అలా కాకుండా మొత్తం కూలిస్తే ఎలా అని, సొంతంగా కట్టుకున్న ఇల్లు నిబంధన ప్రకారం పోయిన… కొద్దిగైనా మిగులుతుందని ఆశ ఉంటుంది కదా… అలా కాకుండా మొత్తం కూలిస్తే ఎలా అని ఎమ్మార్వో ని అడిగితే ఏం సమాధానం చెప్పటం లేదన్నారు. ఒక కమ్యూనిస్టు నాయకుడిపై, మండల వ్యాప్తంగా ప్రజా సమస్యలపై కొన్ని సందర్భాలలో ప్రభుత్వ అధికారులను ప్రశ్నించానని, వ్యక్తిగత కక్షుల దృష్టిలో పెట్టుకుని, అధికార పార్టీ కాంగ్రెస్ నాయకుల నుండి వచ్చిన ఒత్తిడి కారణంగా ఈ విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని,కక్ష సాధింపు కు పాల్పడుతున్న తాసిల్దార్ పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్ఓడబ్ల్యు పరిధిలో గ్రామంలో ఇంకా రహదారి వెంట ఇండ్లు కుల్చాల్సి ఉన్నప్పటికీ, వాటన్నిటిని వదిలేసి అధికారం యంత్రంగా మొత్తం కేవలం నా ఒక ఇంటి వద్దనే ఉండి మరి కూల్చివేపియడం దారుణం అన్నారు.. ప్రభుత్వ నిబంధనల మేరకు ఇంటిని కూల్చేందుకు ఎప్పుడు సహకరిస్తానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
ఎమ్మార్వో రవికుమార్ వివరణ: రోడ్డు పనుల విస్తరణలను భాగంగా..ప్రభుత్వ నిబంధన ప్రకారం, పై అధికారులు నాకు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఇంటిని కూల్చడానికి వెళ్ళాము. సదరు కృష్ణారెడ్డి కావాలని నాపై ఆరోపణలు చేస్తున్నారు. మార్క్ వరకు కూల్చుకునేందుకు చాలా సమయం ఇచ్చాం. అయినప్పటికీ ఇంతవరకు కూల్చలేదు. మళ్లీ ఇప్పుడు మార్కు వరకు కూల్చేందుకు వెళితే వాదన వేసుకుంటున్నారని, తెలిపారు. ఆయనపై నాకు ఎటువంటి వ్యక్తిగత కక్ష లేదన్నారు.