– క్యూరింగ్ చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్న కాంట్రాక్టర్లు..?
నవతెలంగాణ – అచ్చంపేట
గ్రామాలలో అంతర్గత మట్టి రోడ్లు ను సీసీ రోడ్లుగా నిర్మాణం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్లు ఇస్తానుసారంగా సీసీ రోడ్లు నిర్మిస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. కొన్ని గ్రామాలలో సీసీ రోడ్లు వేసి క్యూరింగ్ చేయడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీంతో పది కాలాలపాటు ఉండవలసిన సిసి రోడ్లు ముచ్చటగానే ఉంటాయని చర్చించుకుంటున్నారు. (ఎన్ఆర్ఈజీఎస్ ) ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా సిసి రోడ్లు వేస్తున్నారు. అచ్చంపేట నియోజకవర్గం లోని పదర, అమ్రాబాద్, అచ్చంపేట, వంగూరు, ఉప్పునుంతల, లింగాల, బలుమూరు మనలను వివిధ గ్రామపంచాయతీలలో 15 కోట్ల 30 లక్షల రూపాయలతో గ్రామాలలో ఉండే అంతర్గతరులను సిసి రోడ్డుగా మారుస్తున్నారు. సర్పంచుల పదవీకాలం ముగిసిపోయింది. గ్రామపంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని విమర్శలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 15 కోట్ల 30 లక్షలతో చేపడుతున్న సిసి రోడ్ల పై అధికారుల నిర్లక్ష్యం విడాలని ప్రజలు కోరుతున్నారు. చాలా గ్రామాలలో సిసి రోడ్లు నిర్మాణం చేసి క్యూరింగ్( వాటర్) పోయడం లేదని ప్రజలు తెలుపుతున్నారు. అచ్చంపేట మండల పరిధిలోని లింగోటం , లింగోటం తండా లలో నిర్మించిన సిసి రోడ్లు కు (క్యూరింగ్) వాటర్ సక్రమంగా పట్టడం లేదు. ముందే ఎండాకాలం కావడంతో క్యూరింగ్ సక్రమంగా చేయకపోవడం వల్ల బీటలు వచ్చి, సీసీ రోడ్డుకు పగుళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా సంబంధించిన అధికారులు సీసీ రోడ్ల నిర్మాణాలపై పర్యవేక్షణ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.