మల్హర్ లో పలు అభివృద్ధి పనులు ప్రారంభం

నవతెలంగాణ – మల్హర్ రావు
తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు, శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబు ఆదేశాల మేరకు మండలంలోని తాడిచెర్ల, మల్లారం,రుద్రారం,పెద్దతూoడ్ల గ్రామాల్లో డిఎంఏపీటి,జాతీయ గ్రామీణ ఉపాధిహామీ నీదుల నుంచి దాదాపు రూ.1.20 కోట్ల అభివృద్ధి పనులను మండల ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు,వైస్ ఎంపిపి బడితేల స్వరూప రాజయ్య,ఎంపిడిఓ శ్యాం సుందర్,తహశీల్దార్ రవి కుమార్ ప్రారంభించారు.ఈ క్రమంలో తాడిచెర్లలో ఎస్సి కాలనిలో పైప్ లైన్ రూ.5 లక్షలు, వేంకటేశ్వర ఆలయం వద్ద బోర్ బావి రూ.1.50 లక్షలు,తహశీల్దార్ కార్యాలయం వద్ద బోర్ బావి రూ.1.75 లక్షలు, పెద్దతూoడ్ల గ్రామంలో లోకె మనోహర్ ఇంటి నుంచి ఆర్ అండ్ బి మెటల్ రోడ్డు రూ.20 లక్షలు, ఏరిటల్ టవర్ నుంచి నారా శేఖర్ ఇంటి వరకు సిసిరోడ్డు రూ.10 లక్షలు, ఎస్సి కాలనిలో సిసి రోడ్లు రూ.20 లక్షలు, భూ లక్ష్మీ నుంచి బియ్యని సత్తయ్య ఇంటి వరకు సిసి రోడ్డు రూ.5 లక్షలు,తోగరి కౌసల్య ఇంటి నుంచి తోగరి రవి ఇంటి వరకు సిసి రోడ్డు రూ.5 లక్షలు, ఎస్టీ కాలనీలో గాంధీ బొమ్మ నుంచి లక్ష్మీ దేవి ఆలయం వరకు సిసి రోడ్డు రూ.5 లక్షలు, షాత్రజ్ పల్లి బీటు రోడ్డు నుంచి ఎస్టీ కాలనీ వరకు సిసిరోడ్డు రూ.5 లక్షలు, ఆర్ అండ్ ఆర్ రోడ్డు నుంచి లంబడీ కుంట వరకువ మేటల్ రోడ్డు రూ.10 లక్షలు, రుద్రారం గ్రామంలో నీటి సమస్య పరిష్కరానికి రూ.3 లక్షలతో రెండు బోర్ బావులు, మల్లారం గ్రామంలో రూ.29 లక్షలతో సిసి రోడ్లు పనులు ప్రారంభం అయ్యాయి.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య, సింగిల్ విండో చైర్మన్ రామారావు, డైరెక్టర్లు ఇప్ప మొoడయ్య,సంగ్గేం రమేష్,తిరుపతి రావు, కాంగ్రెస్ నాయకులు చెంద్రయ్య, బొబ్బిలి రాజు గౌడ్,కుంట సది, అశోక్ రావు,అంజయ్య,రాజేశ్వర్ రావు,లింగన్నపేట రమేష్,మురళి,రూపేస్ రావు,రాజు నాయక్,శ్రీదర్,హకీమ్ పాల్గొన్నారు.